బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు సిరిసిల్లలో మాట్లాడుతూ, ఈ కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ చేసిన అరాచకాలను పార్టీ క్యాడర్ అందరికీ వివరించాలని వారి చేతగానితనాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి కేసుల గురించి మాట్లాడితే మనం రైతుల గురించి మాట్లాడాలని, ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు కొట్లాడాలని అన్నారు. ముఖ్యమంత్రి గారికి నాలుగు వేల పెన్షన్లు ఇవ్వకుండా ఎవరు ఆపుతున్నారని, మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తున్నారని, ఆడపిల్లలకు స్కూటీలు ఎక్కడని ? కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా కట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.