తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాది దాటింది. ఏడాదికి నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ళని పేద ప్రజలకు పంచి ఇస్తానని చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్, గత దసరా దగ్గర నుండి ఇందిరమ్మ ఇల్లు అదిగో వస్తాయి ఇదిగో వస్తాయని అంటూనే ఉంది. తాజాగా పల్లె పల్లెల్లో అన్ని ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు కావాలి అనుకునే వారి జాబితాని తయారు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ సంవత్సర కాలంలో ఒక ఇటుక కూడా లేపని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ నుంచి వచ్చాయని అనుమానం రాక మానదు. నిజానికి ఇవన్నీ గత ప్రభుత్వంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లే కాకపోతే ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని లబ్ధిదారులకి పంచి పెడితే ఎన్నికలలో ఇల్లు రానివారు BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం ఉంది. అందుకే గత ప్రభుత్వం చాలా ఇళ్ళని పంచి పెట్టకుండా అలాగే వదిలివేసింది. ఇప్పుడు అవే ఇళ్లకు కాంగ్రెస్ రంగులు వేసి ఇందిరమ్మ ఇల్లుగా పంచిపెట్టబోతుంది ఈ రేవంత్ ప్రభుత్వం. మొదటి సంవత్సరంలోనే ఇళ్లను కట్టిస్తానని మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చే నాలుగేళ్లలో అయినా ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తుందంటారా ?