దిల్ రాజు ఇటీవల తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి పొందిన విషయం మనకు తెలిసిందే. దీని వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఎవరికైనా తెలుసు. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏ పెద్ద సినిమాకైనా మేము బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వమని తేల్చి చెప్పారు, కానీ అది తెలుగు చిత్ర పరిశ్రమని దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు. ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉన్న దిల్ రాజు సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం కి చాలా ప్రభావం చూపనుంది. అందుకే దిల్ రాజు రేవంత్ రెడ్డి నీ ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. దిల్ రాజు కోసం రేవంత్ రెడ్డి ఈ సినిమాలకి బెనిఫిట్ షో టికెట్ హైక్ కానీ ఇస్తే ప్రజల్లో రేవంత్ మీద వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది. ఇదే జరిగితే అల్లు అర్జున్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రతీకార చర్యలు మాత్రమే తీసుకున్నట్టు ప్రజలకు సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంది. మరి దిల్ రాజు కోసం రేవంత్ ఇంత పెద్ద త్యాగం చేస్తాడా ?