మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీకి భారతదేశ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ని ఎంపిక చేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ లో అర్ధాంతరంగా రోహిత్ ని దూరం పెట్టడం మనకు తెలిసిందే . భవిష్యత్తులో వచ్చే టెస్ట్ సిరీస్లో రోహిత్ ఆడతాడా లేదా అనేది ఎవరికి తెలియదు, ముఖ్యంగా బీసీసీఐ రోహిత్ విషయంలో కచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చిందని కొన్ని మీడియా ఛానల్లు ముందుగానే కథనాలు రాస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ ని తప్పించి హార్థిక్ పాండ్యా కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని గౌతమ్ గంభీర్ అదేవిధంగా అజిత్ అగర్కర్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆడాల్సిందే