కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గెలిచి సంవత్సరం పైన అయిపోయింది, ఇప్పటివరకు ఒక్క విడత రైతు భరోసా ఇవ్వకపోవడం గమనార్హం. ఇక రైతు రుణమాఫీ అని కాంగ్రెస్ చేసిన ఒకే ఒక్క వాగ్దానం కూడా సగం కూడా పూర్తి కాలేదని అందరికీ తెలుసు. రైతుల పంటని కొనడంలో కూడా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా విషయంలో మాత్రం మంచి నిర్ణయాన్ని తీసుకుంటుందని అందరూ భావించారు, కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రైతు భరోసా కావాలంటే ప్రతి రైతు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ప్రతి సంవత్సరం డిక్లరేషన్ రాసి ఇవ్వాలని అప్లికేషన్లు నింపాలని అప్పుడే సాగు చేసిన వారికే రైతు భరోసా వస్తుందని కాంగ్రెస్ నాయకులు మీడియా ద్వారా లీకులు ఇస్తున్నారు. ఇదే నిజమైతే ప్రతి రైతు తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం కోసం వరుస క్రమంలో నిలబడి బారులు తీరాల్సిందేనని రైతులు భావిస్తున్నారు. మరి ఇది నిజమా లేకపోతే మీడియా సృష్ట అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే