నల్గొండ జిల్లాలో కోమటి బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఎన్నో వ్యాపారాలు చేస్తూ మీడియా ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడప్పుడు తన అసంతృప్తిని మెల్లిగానే వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కేసిఆర్ కేటీఆర్ జగదీశ్ రెడ్డి విషయాలలో చాలా ఉదారంగ వ్యవహరిస్తున్నారని నేనైతే ఇప్పటికే జైలులో వేసి ఉండేవాడిని అన్నారు.