అందరి లెక్క తేలుస్తా అంటున్న రోహిత్ శర్మ

 


టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే .ఈ టెస్ట్ లో రోహిత్ శర్మ రోహిత్ శర్మని డ్రాప్ చేశారని మీడియా గగోలు పెట్టింది అదేవిధంగా ఈ నిర్ణయం వెనక గంభీర్ కఠినంగా ఉన్నట్టు సెలెక్టర్  నుండి కోచ్ వరకు అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లు కూడా రోహిత్ శర్మని డ్రాప్ చేయడమే కరెక్ట్ అని భావించినట్టు చాలా కథనాలు మీడియాలో వచ్చాయి. వాటిని నిజం చేస్తూ రోహిత్ శర్మ ఆఖరి నిమిషంలో సిటీ టెస్ట్ నుంచి వైదొలిగాడు. మరి ఇది రోహిత్ శర్మ రిటైర్మెంట్ కి దారితీస్తుందా లేదా అనే ఆసక్తి దేశమంతా మొదలైంది వీటిని పటాపంచలు చేస్తూ రోహిత్ శర్మ ఈరోజు సిడ్నీ టెస్ట్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తన బ్యాటింగ్ ఫామ్ బాలేదు కాబట్టి దేశానికి చాలా ముఖ్యమైన ఈ టెస్టులో  తాను ఆడడం కరెక్ట్ కాదని భావించి తప్పుకున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు. ప్రస్తుతానికి నా ఫామ్ బాలేదు కాబట్టి పక్కకు కూర్చున్నాను, వచ్చే ఐదు నెలల్లో నా ఫామ్ తిరిగి రావచ్చు నేను మళ్లీ క్రికెట్లో మునుపటిలాగా కొనసాగవచ్చు అని చెప్పాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన లేదని అదే విధంగా మీడియా వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని, చాలామంది మీడియా వాళ్ళు అలా ఒక పేపరు పెన్ను పట్టుకొని లాప్టాప్ ముందు కూర్చుని ఏది పడితే అది రాస్తుంటారని, వారు చెప్పినట్టు బయట జరగదని ఎవరి సొంత నిర్ణయాలు వారికి ఉంటాయని ,ఎవరి ఆట వారిదేనని ఎవరు భవిష్యత్తు వారిదేనని మీడియా వారికి చురకలు అంటించాడు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తను మళ్ళీ రానించి అందరి లెక్క తేలుస్తా అని నవ్వుతూ చెప్పాడు రోహిత్ శర్మ.

Post a Comment

Previous Post Next Post