మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పందెం మొదలవుతుంది, కోళ్ల పందల్లాగా సంక్రాంతికి మూడు నాలుగు పెద్ద సినిమాలు రావడం అనేది ఆనవాయితీ. ఈసారి కూడా మూడు పెద్ద సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాల ఇండస్ట్రీ టాక్ ఏంటో తెలుసుకుందాం రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా ఒక మోస్తారుగా పరవాలేదు అనేలా ఉందని తెలుస్తుంది, అదేవిధంగా బాలకృష్ణ డాకు మహారాజు సినిమాలో అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయని అవికాని క్లిక్ అయితే బాలయ్య సినిమాను ఎవరు ఆపలేరని చెప్తున్నారు. ఇంకోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే మంచి టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా పండిందని మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.