స్క్విడ్ గేమ్ 2 ఎలా ఉంది ?

 


2021లో NETFLIX లో ఒక సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో వీడియో గేమ్ ని ఒక కథలా తీసుకొని అద్భుతమైన ఎమోషన్స్ ని పండించింది స్క్విడ్ గేమ్. మొదటి సీజన్ తో సంచలనం సృష్టించిన స్క్విడ్ గేమ్ రెండో సీజన్ ఎలా ఉందో తెలుసుకుందాం.


 మొత్తం ఈ సీజన్లో 7 ఎపిసోడ్లు ఉండగా మొదటి రెండు ఎపిసోడ్లు కచ్చితంగా బోర్ కొట్టిస్తుంది. మూడవ ఎపిసోడ్లో కథ అందుకుంది అనగానే స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మొదటి సీజన్లో గేమ్స్ ని చూసినప్పుడు వచ్చే టెన్షన్ ఈ సీజన్లో రాకపోవడం పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. గేమ్స్ ని ఆపడానికి వచ్చిన హీరోకి పెద్దగా స్ట్రాటజీ లేకపోవడం కథలో  బలం లేనట్టు అనిపిస్తుంది. అసలు గేమ్స్ ని ఆపాలనుకున్న హీరో మొదటి గేమ్ అవ్వకముందే కదిలితే చనిపోతారనే విషయం ఎందుకు చెప్పలేదో ఎవరికీ అర్థం కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీజన్లో ఎన్నో బొక్కలు కనిపిస్తాయి. పెద్దగా ఆసక్తి కనబరిచే సీన్లు లేకపోవడం హీరో దగ్గర ఎటువంటి ఉపాయాలు  లేకపోవడంతో  చాలావరకు చూసిన సన్నివేశాలే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆఖరి ఎపిసోడ్ ఎందుకలా ముగిసింది అనేది ఎవరికి అర్థం కాదు. మొత్తానికి ఈ సీజన్ తదుపరి 3వ  సీజన్ కోసం సాగదీశారేమో అని అనుమానం రాకమానదు. మీరు మొదటి సీజన్ ని బాగా ఎంజాయ్ చేసినట్లయితే ఈ సీజన్ చూస్తే కచ్చితంగా నిరాశపడతారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా టైం ఉన్నప్పుడు మాత్రం చూడండి కానీ అది సీజన్ 3 కోసం మాత్రమే అని గుర్తు పెట్టుకోండి.


1 Comments

  1. సీజన్ 3 కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు

    ReplyDelete
Previous Post Next Post